JSON Variables

కొనుగోలు కేంద్రాలు లేక అకాల వర్షంతో రైతులు రూ.1300, రూ.1400కే వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు అమ్ముకుటున్నారు


కొనుగోలు
కేంద్రాలు లేక అకాల వర్షంతో రైతులు రూ.1300, రూ.1400కే వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు అమ్ముకుటున్నారు

NEWSPOWER DESK:

 ఏ ఐ యూ డబ్ల్యూ సీ రాష్ట్ర ఉపాధ్యక్షలు కొడాలి సురేష్

కొనుగోలు కేంద్రాలు లేక అకాల వర్షంతో రైతులు రూ.1300, రూ.1400కే వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు అమ్ముకున్నారు.  అంటే రూ.1940 ఉన్న కనీస మద్దతు ధర కూడా రైతులకు అందలేదు.టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. ఈ ధాన్యం మొత్తాన్ని రైస్ మిల్లర్లనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.1940తో కొనుగోలు చేసింది. రైస్ మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి  మూడు, నాలుగు వందల రూపాయాల తక్కువ ధరకు తీసుకోవడం జరిగింది.  ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగింది. పంట పొలాల్లో ఉన్నప్పుడు పందికొక్కులు మేస్తావుంటాయి. ఈ టీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లాగా రూ. 18 వేట కోట్లను మేశారు.దీనినుంచి తప్పించుకోవడం కోసమే బీజేపీ నాయకులు అమిత్ షాను కలుస్తారు.. టీఆర్ఎస్ మంత్రులు పందికొక్కుల్లా మెక్కి వచ్చి ఇక్కడ నాటకాలు చేస్తున్నారు.బీజేపీ పార్టీ మోదీ.కి చిత్తశుద్ధి ఉంటే రూ.18 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలి. లేకపోతే ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ రైతుల కష్టార్జితాన్ని రూ.18వేల కోట్లను మెక్కినట్లుగా తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకుంటుంది.

Post a Comment

0 Comments