బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
బెల్లంపల్లి: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జేరిపోతులనారాయణ, అనసూర్య,పద్మావతి మరియు సతీష్ గార్ల జ్ఞాపకార్థంగా వారి కూతురు రాజేశ్వరిగారు గురువారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. స్వర్గస్తులైన వారి ఆత్మ శాంతించాలని సేవా ట్రస్టు ద్వారా తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు, అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు తెలిపారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు.మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దునసతీష్, ట్రస్ట్ సభ్యులు,సేవకులు పాల్గొన్నారు.