మృతుని కుటుంభానికి రూ. లక్ష ఆర్థిక సహాయం చేసిన పిఎస్ఆర్
మంచిర్యాల జిల్లా చెన్నూర్: ప్రభుత్వ ఉద్యోగ అవకాశం రాక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న కోటపల్లి మండలం బబ్బేర చిలుక గ్రామానికి చెందిన ఆసం పల్లి మహేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అండగా నిలిచారు. మహేష్ ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరీక్షించి చివరకు విసిగివేసారి అక్టోబర్ 31న ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రాని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు మహేష్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిరుపేద కుటుంబానికి చెందిన మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాలనే మంచి మనసుతో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం బొబ్బరిచిలుకకు వెళ్ళి మృతుని కుటుంబానికి లక్ష రూపాయల నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని అధైర్యపడవద్దు అంటూ పిఎస్ఆర్ భరోసా కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు..