హసన్ పర్తి మండలం దేవన్నపేట్ గ్రామంలో టి.ఆర్.ఎస్. విజయ గర్జన సభ కోసం రైతుల వద్ద నుండి టి.ఆర్.ఎస్. నాయకులు, పోలీస్ అధికారులని మరియు రెవిన్యూ అధికారులని అడ్డం పెట్టుకొని గ్రామ ప్రజలను భయబ్రంతులు చేస్తూ రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని తెలుసుకొని హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్ తో కలిసి అక్కడి రైతులతో మాట్లాడానికి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, కర్పోరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ అద్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.