అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు వాహనాలు సీజ్...
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ మానేరు వాగు నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టాటా పికప్ మరియు ట్రాక్టర్లను చిప్పల పల్లి గ్రామం వద్ద పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు