JSON Variables

తాండూర్ మండల రెవెన్యూ అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు

తాండూర్ మండల రెవెన్యూ అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు

NEWSPOWER REPORTER:సాయిరాం
తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీ పరిధిలో గల భూములను నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని, ఆ పట్టాలను రద్దు చేయాలని బిజెపి నాయకులు కలెక్టరేట్ ఏ ఓ కు సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ రేచిని గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెం.644/అ లోని 1 ఎకరం 10 గుంటలు, సర్వే నెం. 429/అ/2 లోని 20 గుంటలు మరియు సర్వే నెం. 431/1 లోని 22 గుంటల భూమిని తాండూర్ రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నివాస స్థలాలను వ్యవసాయ భూములుగా పట్టా చేశారన్నారు. గతంలో ఈ భూములను పట్టాదారు సాదా బైనామాతో ఇతరులకు అమ్మగా, అవే భూములను పట్టాదారు మరణానంతరం పట్టాదారుకు ముగ్గురు కుమారులు ఉండగా మూడవ కుమారుడి  వాంగ్మూలం లేకుండానే విలాసత్ ద్వారా ఇప్పుడు పట్టాదారు ఇద్దరు కుమారులకు మాత్రమే  పట్టాలు జారీ చేయడం తాండూర్ రెవెన్యూ అధికారుల అవినీతికి నిదర్శనమన్నారు.ఈ కార్యక్రమంలో ఆదే శేఖర్, బామనిపెల్లి ఆనంద్ రావు, మల్లేష్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments