Skip to main content

Posts

పంట పొలాలకు నీటిని విడుదల చేయాలి

పంట పొలాలకు నీటిని విడుదల చేయాలి  •రహింఖాన్ పేట  రైతుల రాస్తారోకో   న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎండి పోతున్న  పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని రహీంఖాన్ పేట గ్రామ రైతులు రాస్తారోకో  నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నపూర్ణ ప్రాజెక్టు నుండి అనంతారం చెరువులకు నీటిని విడుదల చేయాలని వాగు ద్వారా రహీంఖాన్ పేట చెరువులోకి నీరు వస్తుంది అన్నారు నీరు లేక సుమారుగా 5 వందల ఎకరాల వరి పంట ఎండుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రెండు నెలల్లో మా గ్రామానికి నీరు అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని అన్నారు లేని పక్షంలో క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా న్యూస్ పవర్ , 24 ఫిబ్రవరి , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం లబ్దదారులు రోడ్ పై బైటాయించి ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలోనే గ్రామ సభలో 32 మంది లబ్ధదారులను ఎంపిక చేశారని డబుల్ బెడ్ రూం లో మిగులు పనులు నీళ్ళు రోడ్ కరెంట్ ఇంకా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని కిరాయి కట్టలేక కుటుంబ పోషణ పిల్లల చదువులు భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు మా బాధను పట్టించుకోవడం పట్టించుకోవడంలేదని అన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపి త్వరగా మాకు ఇల్లు కేటాయించాలని కోరారు తర్వాత ఎమ్మార్వో కి వినతిపత్రం అందించారు .

ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ అభినందనీయం

ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ అభినందనీయం • ఎంపీపీ ఉట్కురి వెంకట రమణ రెడ్డి  న్యూస్ పవర్ , 20 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), రాజన్న సిరిసిల్ల  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే టాలెంట్ టెస్ట్  విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకు, విద్యార్థులలో పోటీతత్వాన్ని నెలకొల్పేందుకు, రానున్న పరీక్షలకు సన్నద్దం చేసేందుకు, టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని ఎంపిపి ఉట్కరి వెంకట రమణ రెడ్డి అన్నారు. అనంతరం రహిఖాన్ మోడల్ స్కూల్ లో ఎస్ఎఫ్ఐ  టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాన్ని అవిష్కరించారు. అనంతరం వారు  మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు సన్నద్దం కావాలని, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు ఇటువంటి టాలెంట్ టెస్ట్ లు ఉపయోగపడతాయని, ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ అభినందనీయం అని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్ మాట్లడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ టెస్ట్ విజయవంతం అయ్యిందని జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నిర్వహించే టాలెంట్ టెస్...

బిక్క వాగు బ్రిడ్జిపై రైతులతో బీజేపీ నాయకుల ధర్నా

బిక్క వాగు బ్రిడ్జిపై రైతులతో బీజేపీ నాయకుల ధర్నా  న్యూస్ పవర్ , 19 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట వంతడుపుల మధ్యలో గల బిక్క వాగు  బ్రిడ్జిపై భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి తక్షణమే నీరు వదిలి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెళ్లి సత్యనారాయణకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి తక్షణమే నీరు వదలాలని కోరారు. ఎన్నో గ్రామాల రైతన్నల వందల ఎకరాలకు నీరు లేక ఎండిపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. ఆరుకాలం కష్టపడి సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతన్నలు రోడ్డుమీదకి వచ్చి తమ ఆవేదనను వెల్లబోసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా రైతులను తక్షణమే ఆదుకోవాలని లేనిపక్షంలో ఇంకా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుండి ఎన్నో ధర్నాలు చేస్తామని డిమాండ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు తిప్పారపు శ్రావణ్, వజ్జే పెళ్లి ...

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జనం న్యూస్ , 19 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒగ్గు నర్సయ్య యాదవ్ ఎంపీటీసీ  మాట్లాడుతూ శివాజీ  మొగలులను ఓడించి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసారని ప్రతి పౌరుడు శివాజీ ఆలోచనలతో ఎదగాలని అన్నారు. విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు ఎగుర్ల శ్రీనివాస్  మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఒక శివాజీ ఉండాలని జీజియా భాయి శివాజీకి తన చిన్నతనం నుండే దేశభక్తిని పోరాట ప్రతిభను చెప్పుతూ పెంచినందువలన ఈరోజు మన అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు, అలాగే ప్రతి ఇంటిలో ఉండే తల్లులు వారి పిల్లలకి దేశభక్తిని చెబుతూ పెంచాలని కోరారు. వచ్చిన అతిరథ మహారదులు హిందూ బంధువులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ రావు బాలరాజు  రాజేష్ శర్మ పంతులు బజరంగ్దళ్ మండల అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాస్  వివేకానంద సేవ సమితి అధ్యక్షుడు మామిడి పరుశురాం  రామ్ సేటు,ఎం రాజు, కే కిషన్, రమేష్ ...

ఇల్లంతకుంట మండల, గ్రామ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

ఇల్లంతకుంట మండల, గ్రామ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. న్యూస్ పవర్: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ మండల మనుమయ సంఘం అధ్యక్ష, కార్యదర్శి కార్యవర్గాన్ని నియమించారు.. మండల అధ్యక్షులుగా దేశరాజు తిరుపతి,ఉపాధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కోడిముంజ రవి, ప్రధాన కార్యదర్శిలుగా కోడిముంజ తిరుపతి, కోశాధికారిలుగా తిప్పారపు సురేష్ కుమార్,  సహాయక కార్యదర్శిలుగా కొత్తపల్లి విఠల్, సలహాదారులుగా తిప్పారపు హన్మండ్లు, మొగోలుజు వెంకట చారి లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.  ఇల్లంతకుంట గ్రామ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్ష, కార్యదర్శి కార్యవర్గాన్ని నియమించారు. పట్టణశాఖ అధ్యక్షులుగా తిప్పారపు స్వామి, ఉపాధ్యక్షులుగా తిప్పారపు నాగరాజు, లంకోజు చంద్రం, ప్రధానకార్యదర్శిలుగా నాగసముద్రాల రాజు, కోశాధికారిలుగా రాంపెల్లి రమేష్, సహాయక కార్యదర్శిలుగా తిప్పారపు సతీష్, ముఖ్య సలహదారులుగా నాగసముద్రాల నర్సింహ చారి, తిప్పారపు శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తార...

విద్యార్థుల మౌలిక వసతుల కల్పనకు కృషి

విద్యార్థుల మౌలిక వసతుల కల్పనకు కృషి న్యూస్ పవర్ , 9 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే  డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ  ఎమ్మెల్యేగా గెలుపొంది, మొదటిసారిగా ఇల్లంతకుంట హైస్కూల్ కు విచ్చేసిన సందర్భంగా, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు బోరు మంజూరు చేయమని అడగడంతో, ఎమ్మెల్యే  స్పందించి శుక్రవారం బోరు వేయించాలని చెప్పడంతో  ఎంపీపీ ఇల్లంతకుంట మండల కేంద్రంలోనీ హైస్కూల్లో కొబ్బరికాయ  కొట్టి బోరును వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ  వుట్కూరి వెంకట  రమణా రెడ్డి  మాట్లాడుతూ  ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ  విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తారని, ప్రజాసంక్షేమమే ఆయన ధ్యేయంగా పనిచేస్తారని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, కార్యదర్శి వరుణ్, తుంకుంట మోహన్ రెడ్డి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.