ఎల్‌నినో పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

 న్యూస్ పవర్ , 5 నవంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయాల వివరాలను పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేసుకునే ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ వంటి పంటలను సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపాలని తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు సమస్యలను అధిగమించవచ్చని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments