రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
• ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
ఇల్లంతకుంట: మండలంలోని వెల్జీపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని తమ పంటను మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇల్లంతకుంట పీఏసీఎస్ చైర్మన్ ఊట్కూరి రమణారెడ్డి, సర్పంచ్ నవీన్ కుమార్, డైరెక్టర్ గుండా వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ శ్రీనివాస్, అధ్యక్షుడు ఎం. బాల్ రెడ్డి తదితరులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
0 Comments