రైతులు కంట నీరు పెట్టకుండా చూడండి
• రైతు అభివృద్ధి,సంక్షేమానికి పాటుపడండి
• ఇల్లంతకుంట ఏఎంసీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి హితవు
రైతులు కంటనీరు పెట్టకుండా వారి అభివృద్ధి సంక్షేమానికి పాటు పడాల్సిన బాధ్యత వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంపై ఉందని మానకొండూరు ఎమ్మెల్యే టిపిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ శ్రీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అంతగిరి సాహిత్య వినయ్ కుమార్,
వైస్ చైర్మన్గా భరత్ రెడ్డి, డైరెక్టర్లుగా వి. మల్లయ్య, బడుగు లింగయ్య, వి. శ్రీనివాస్ రెడ్డి, జెట్టి మల్లేశం, మంద బాల్ రెడ్డి, వెలిశాల జ్యోతి, బంగారి అంజయ్య, ఎరుకల తిరుపతి, జుట్టు నగేష్, ఎం. నవీన్ రెడ్డి, ఉప్పల వేణు, జి. శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా అందించే సేవలతో రైతులు సంతోషంగా ఉండాలే తప్ప బాధతో కంటనీరు పెట్టే పరిస్థితి కల్పించొద్దన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, మార్కెట్ కమిటీకి రైతులు అండగా ఉండాలన్నారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్ నిత్యం రైతుల సమస్యల పరిష్కా రంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ఇల్లంతకుంట మార్కెట్ కమిటీని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం రేవంత్రెడ్డి చేస్తున్నారన్నారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ మార్కెట్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మార్కెట్ యార్డును అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తూ రైతులు పండించి పండించిన ధాన్యానికి భద్రత కల్పించేందుకు గోదాముల నిర్మాణం అనేక వసతులు కల్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. రైతులకు మార్కెట్లో అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పాలకమండలి పని చేయాలని సందర్భంగా పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ఆది నుండి కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి పాటుపడుతూనే ఉందని ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ఈ దిశగా ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చెప్పారు.బీఆర్ఎస్ పాలనలో లక్ష రూపాయల రుణ మాఫీ చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణ మాఫీ చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తూకాల పేరుతో భారీ మోసాలు జరిగాయని, వాటికి చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల కొనుగోలు కేంద్రాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు కూడా జమ అవుతుందని ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు లాభం, గిట్టుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. రైతులకు రైతుపై ట్రాక్టర్లు, విత్తనాలు, ఎరువులు ఇప్పిస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావం రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాల్చనున్నదని, ఈ దృష్ట్యా రైతులు ఆరు తడి పంటల సాగుపై దృష్టి సారించాలని ఆయన చెప్పారు.
అక్రమంగా సాగునీరు మళ్లింపు
మిడ్ మానేరు నుంచి అనంతరం మల్లన్న సాగర్ మీదుగా వచ్చే నీటిని పైపు లైన్ల ద్వారా అక్రమంగా కేసీఆర్ తన రేవల్లి లో ఫామ్ హౌస్ వద్ద వంద ఎకరాల్లో నిర్మించిన చెరువుకు మళ్లించారని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి
అందరికీ పదవులు సాధ్యం కానప్పటికీ కష్టపడ్డోళ్లకు మాత్రం పదవులు కట్టబెట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కష్టపడుతున్న వారికి పదవులు కల్పించే విషయంలో నిరంతరం తన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.పదవులు రానంత మాత్రాన పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు నిరాశ పడకూడదని, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపిక, సహనం,సంయమనం కోల్పోకూడదని ఆయన సూచించారు. నిరీక్షణ, ఓపిక తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం
ఏఎంసి పాలకవర్గ ప్రమాణ స్వీకారం స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఇల్లంతకుంటకు విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు భారీగా తరలివచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు. క్రేన్ సహాయముతో గజమాలవేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఎడ్లబండిపై సభా ప్రాంగణానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ప్రజా పాలన రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానిక బస్టాండ్ చౌరస్తాలోని ఇందిరా గాంధీ విగ్రహానికి, తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సభా ప్రాంగణానికి డప్పు చప్పులతో ముందుకు సాగారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఇల్లంతకుంట,
పాక్స్ చైర్మన్ ఊట్కూరి వెంకటరమణారెడ్డి,
మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి,బెజ్జంకి నుస్తులాపూర్,పోరండ్ల, ఊటూరు పాక్స్ చైర్మన్లు ఒగ్గు దామోదర్, మోరపల్లి రమణారెడ్డి, గోపు తిరుపతిరెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు రాఘవరెడ్డి, పసుల వెంకటి, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రసాద్, ఉప్పగల్ల మల్లారెడ్డి, జనగాం రాజయ్య,
ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.

0 Comments