న్యూస్ పవర్ , 4 నవంబర్ , ఇల్లంతకుంట: పెద్దలింగపూర్ రైతు వేదికలో మండల స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ ఆధ్వర్యంలో యాసంగిలో ఎల్నినో ప్రభావం వల్ల వ్యవసాయంపై కలిగే ప్రభావాలు మరియు రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరిస్తూ వరికి బదులుగా తక్కువ నీటి అవసరం ఉన్న ఆరుతడి పంటలు సాగు చేయాలని వివరించడం జరిగింది. అలాగే కేత్ బచావో అభియాన్ ప్రోగ్రాం లో భాగంగ రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేద్రీయ ఎరువులు వేస్తూ నేల ఆరోగ్యం కాపాడాలని సూచించారు. కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్, మండల రెవెన్యూ అధికారి సురేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శశికళ,ఇరిగేషన్ ఏయి దిలీప్, ,ఏఈవో మౌనిక ,వేటర్నరీ అధికారి పూర్ణ చంద్రిక,ఏపీఎం గారు గ్రామ సర్పంచ్ గన్నేరం వసంత , రామోజీపేట సర్పంచ్ చొప్పరి భూమయ్య , ఉపసర్పంచ్ రమేష్,ఉపసర్పంచ్లు, వార్డ్ మెంబర్స్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
0 Comments