దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను సమర్థవంతంగా అమలు చేయాలి
న్యూస్ పవర్ ,24 అక్టోబర్ , ఇల్లంతకుంట:
దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను సమర్థవంతంగా అమలు చేయాలని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్ కోరారు.ఈ సందర్భంగా శనివారం ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్లో ఎస్సై ని కలిసి శాలువాతో సత్కరించి దివ్యాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని అందజేశారు. చట్టంలోని సెక్షన్లు 89, 91, 92పై పోలీసు సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, దివ్యాంగుల హక్కులు, చట్టపరమైన నిబంధనలు, శిక్షల వివరాలు ప్రజలకు తెలిసేలా పోలీస్ స్టేషన్ ముందు అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. దివ్యాంగులపై వివక్ష, వేధింపులు జరగకుండా చట్టంపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వారి హక్కులకు భరోసా కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
ఎస్సై స్పందిస్తూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని త్వరలోనే హక్కుల చట్టం 2016 అవగాహన బోర్డును ఏర్పాటు చేస్తానని చంద్రశేఖర్ యాదవ్ కు హామీ ఇచ్చారు . ఇట్టి కార్యక్రమంలో కట్కూరి తిరుపతి పాల్గొన్నారు.
0 Comments