శ్రీ కృష్ణ గోపాల మండల యాదవ సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం
న్యూస్ పవర్, 10 అక్టోబర్, ఇల్లంతకుంట:
సోమారంపేట, అనంతగిరి గ్రామాల యాదవ సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన శ్రీ కృష్ణ గోపాల మండల యాదవ సంఘం కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో మండల అధ్యక్షులు ఓరుపుల రాములు మాట్లాడుతూ.. మండల పరిధిలోని గ్రామాల్లో యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతానని స్పష్టం చేశారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, మండలంలోని యాదవ బంధువులంతా ఐక్యతతో, కలిసికట్టుగా ఉండి హక్కుల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బాలరాజు, సెక్రటరీ అజయ్, కోశాధికారి రాజశేఖర్, జొర్ర రాజయ్య సోమారంపేట యాదవ సంఘం అధ్యక్షుడు పలమారు కుంటయ్య, ఉపాధ్యక్షుడు సంకటి మల్లయ్య, కార్యదర్శులు వంగ తిరుపతి, పూజారి ఓజయ్య
అనంతగిరి గ్రామ యాదవ సంఘం తరపున గ్రామ సర్పంచ్ మరియు సంఘ అధ్యక్షుడు అరుకల నవీన్ యాదవ్, ఉపాధ్యక్షుడు మీసం శ్రీనివాస్ యాదవ్, కుల పెద్దలు యార మల్లయ్య , అరుకల కొమురయ్య యాదవ్, ఎలుకపెల్లి మల్లయ్య కుర్మ, యార శ్రీనివాస్ యాదవ్, తూముల మల్లేశం యాదవ్, యార ఎల్లయ్య యాదవ్, నూనె మల్లయ్య యాదవ్, యార అంజయ్య యాదవ్, యార కుమార స్వామి యాదవ్, యార కృష్ణ యాదవ్, యారా మహేందర్ యాదవ్ తదితర సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments