గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా దుస్తుల పంపిణీ
ఇల్లంతకుంట: విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకుని శుక్రవారం రహీంఖాన్పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కమటం లావణ్య రాములు పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో పారిశుధ్యం, ఇతర మౌలిక సేవలను నిరంతరం అందిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బంది సేవలను అభినందించారు. పండుగ పూట సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ వారిని సత్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డమీది పద్మ, పంచాయతీ కార్యదర్శి పులి సంధ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments