రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
న్యూస్ పవర్ , 9 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ, తరగతి చదువుతున్న కేశవేణి అన్విత ఎండ్ర సంజన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేకల పావని వ్యాయామ ఉపాధ్యాయుడు సాన బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు గత నెల 29 న వేములవాడలో జల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనరని తెలిపారు. ఈనెల 10 నుండి 12 వరకు యాదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేకల పావని సర్పంచ్ బద్ధం శేఖర్ రెడ్డి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ బట్టు పద్మ శ్రీనివాస్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఉపాధ్యాయ బృందం సీనియర్ క్రీడాకారులు , గ్రామస్తులు అభినందించారు.
0 Comments