తాతనానమ్మల జ్ఞాపకార్థం బస్టాండ్లలో సిమెంట్ బెంచీల ఏర్పాటు

తాతనానమ్మల జ్ఞాపకార్థం బస్టాండ్లలో సిమెంట్ బెంచీల ఏర్పాటు


న్యూస్ పవర్ , 22 అక్టోబర్ , ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో గడ్డమీది కుటుంబ సభ్యులు ఆదర్శనీయమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. దివంగత గడ్డమీది రాజనర్సు - ఆగవ్వ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు గడ్డమీది మల్లయ్య, రాములు, అంజయ్య, నారాయణ మరియు వారి పిల్లలు కలిసి ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలను విరాళంగా అందజేశారు.

సుమారు రూ. 35,000 వ్యయంతో పది సిమెంట్ బెంచీలను కొనుగోలు చేసి, రహీంఖాన్ పేట గ్రామ బస్టాండ్ వద్ద అలాగే ఎర్ర నర్సిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేశారు. నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు, వృద్ధులు వేచి ఉండే సమయంలో కూర్చోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి ఉపయోగపడేలా మంచి నిర్ణయం తీసుకుని, ప్రయాణికుల కోసం బెంచీలు ఏర్పాటు చేసిన గడ్డమీది కుటుంబ సభ్యులను స్థానిక గ్రామస్తులు, ప్రయాణికులు ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments