పేదల వైద్యానికి పెద్దపీట : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
నిరుపేదల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. శనివారం పెద్ద లింగాపూర్ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యఆరోగ్యశాఖ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మారుమూల గ్రామాలకు ఈ శిబిరాలను మరింత విస్తరింపజేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదల వైద్యాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించడమే కాకుండా అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నదన్నారు. అలాగే ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్తులతోపాటు వైద్యేతర సిబ్బందిని నియమిస్తున్నదని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ జీవన, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జి.వసంత-నర్సయ్య,పార్టీ నాయకులు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య,ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ఎల్గందుల ప్రసాద్, రాజేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి, పసుల వెంకటి, మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.
వల్లంపట్లలో...
వల్లంపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించతలపెట్టిన అంగన్ వాడీ కేంద్ర భవనానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమంలో వల్లంపట్ల గ్రామ సర్పంచ్ నేరేళ్ల విజయ్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఉట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య, పార్టీ నాయకులు ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ఎలగందుల ప్రసాద్, పసుల వెంకటి, కాత మల్లేశం, మామిడి రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జవహర్ పేటలో...
ఇల్లంతకుంట మండలం జవహరిపేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాంపెల్లి నాగరాజుతోపాటు పలువురు పంచాయతీ వార్డు సభ్యులు,అంగన్వాడీ టీచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



