- ఈ ఏడాదే రూ. 32 లక్షల విలువైన బీమా క్లెయిమ్‌లు పరిష్కరించాం: మేనేజర్ సాయిరాం
- పెద్దలింగాపూర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత సదస్సు
న్యూస్ పవర్, 6 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంచుకొని, ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు (జిల్లెళ్ల శాఖ) మేనేజర్ శ్రీ సాయిరాం సట్లా కోరారు.
ఇల్లంతకుంట మండలం, పెద్దలింగాపూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం ‘ఆర్థిక మరియు డిజిటల్ అక్షరాస్యత (FDLC)’ అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మేనేజర్ సాయిరాం మాట్లాడుతూ... బ్యాంకులో లభించే వివిధ రకాల రుణాలు, డిపాజిట్ ఉత్పత్తులు, ప్రధాన మంత్రి జనధన్ యోజన (PMJDY) ఖాతాల గురించి గ్రామస్తులకు వివరించారు. ముఖ్యంగా సామాజిక భద్రతా పథకాల (SSS) ఆవశ్యకతను వివరిస్తూ, ఈ ఒక్క సంవత్సరంలోనే తమ శాఖ పరిధిలో 6 పీఎంజేజేబీవై (PMJJBY) క్లెయిమ్‌లను (ఒక్కొక్కటి రూ. 2 లక్షల చొప్పున), అలాగే రూ. 20 లక్షల ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను విజయవంతంగా పరిష్కరించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ బోరెడ్డి శేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గన్నారం వసంత నర్సయ్య, ఉపసర్పంచ్ ఎల్లవేని రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేతిరెడ్డి వెంకట్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఎం. తిరుపతి, విజయ డెయిరీ చైర్మన్ లగల సంపత్, వార్డు సభ్యులు లింగంపల్లి అనిల్, రైతులు కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పయ్యావుల కనకయ్య, భండారి రవి, సిలంబాబు, జంగిటి రాజు మరియు బ్యాంక్ సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
