ఉపాధి పనులను పరిశీలించిన సర్పంచ్ కాత మల్లేశం
న్యూస్ పవర్, 7 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ కాత మల్లేశం శనివారం పరిశీలించారు. గ్రామంలోని డి-6 (D6) కెనాల్లో చేపట్టిన పూడికతీత పనులను ఉప సర్పంచ్ కోదని మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు గూడ బాబుతో కలిసి ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కాత మల్లేశం పని ప్రదేశంలో కూలీలతో ముఖాముఖిగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూలీలకు పని ప్రదేశంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోదని మహేష్, ఎఫ్.ఏ మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు గూడ బాబు, శేఖర్, సాయి మరియు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
