వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి
న్యూస్ పవర్ , 3 డిసెంబర్, ఇల్లంతకుంట:
వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఏ ఎం వి ఐ రజనీ దేవి పేర్కొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు. అగ్రికల్చర్ పేరుతో ఉన్న ట్రాక్టర్లను రవాణాకు వినియోగించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము వాహనాల నంబర్ ప్లేట్లు ఉండాలన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. తనిఖీలలో 10 వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు
