అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి రిమాండ్.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి రిమాండ్.                

 న్యూస్ పవర్,21 ఏప్రిల్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం లోని పొత్తూర్ గ్రామానికి చెంది ఆకుల తిరుపతి పొత్తుర్ బిక్కవాగునుండి 31 మార్చ్ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తన ట్రాక్టర్లో ఇసుక నింపుతుండగా రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకోగా వారిని చూసి ట్రాలిని వదిలి ట్రాక్టర్ ఇంజన్ తీసుకొని పారిపోయినాడని డిప్యూటీ తహశీల్దార్ పిర్యాదు మేరకు తిరుపతి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అప్పటినుండి తిరుపతి తప్పించుకొని తిరుగుతున్నాడు సోమవారం రోజున తిరుపతిని అతని నుండి ట్రాక్టర్ ఇంజన్ ను స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి రీమాండ్ కు తరలించామని ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినట్లయితే కేసు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు.

Post a Comment

0 Comments