JSON Variables

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి 

జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

న్యూస్ పవర్ , 10 అక్టోబర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా :
తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. 
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మాట్లాడుతూ వచ్చే నెల 3 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, 10 తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 13 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 15 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అన్ని అన్నారు. 30 వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉంటుందని, డిసెంబర్ 3 వ తేదీన ఎన్నికల ఫలితాల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే ఎవరూ ఆందోళన చెందవద్దని, నామినేషన్ల స్వీకరణకు 10 రోజుల ముందు వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిన పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. తుది ఓటరు జాబితాలో ఎవరిదైనా ఓటు హక్కు లేకపోతే సంబంధిత బూత్ లెవెల్ ఎలక్టోరోల్ ఏజెంట్ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సి- విజిల్, 1950 నెంబర్, ఎన్జీఆర్ఎస్ కు వచ్చే ఫిర్యాదులకు సత్వర స్పందన అందిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సువిధ కేంద్రం ఉంటుందని, ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు, బహిరంగ సభలు, తదితర వాటి కోసం అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. వీటి అనుమతి కోసం 48 గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని సూచించారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులు కూడా తమ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ పెట్టాలని అన్నారు. ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా, ప్రలోభపెట్టే విధంగా చేస్తే సీ విజిల్ అప్లికేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చని, 100 నిమిషాల్లో కంప్లైంట్ ను పరిశీలించి, వెరిఫై చేసి పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు. ఫస్ట్ లెవెల్ చెకప్ కు ఉపయోగించిన ఈవీఎం మెషీన్ ల జాబితా, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజేషన్ అయ్యే ఈవీఎం ల జాబితా ప్రతినిధులకు సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. 
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ప్రలోభపెట్టే విధంగా, ప్రభావితం చేసే విధంగా పోస్టులు పెట్టకూడదని, అలా చేస్తే సంబంధిత వ్యక్తులతో పాటు గ్రూప్ అడ్మిన్ లపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యంత్రాంగం సోషల్ మీడియా మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని అన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఆన్ లైన్ లో లేదా నేరుగా కార్యాలయంలో ఇవ్వవచ్చని తెలిపారు. 
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధుసూధన్, సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 


Post a Comment

0 Comments