JSON Variables

ఆనంతారం గ్రామంలో తెలంగాణ హరితోత్సవం

ఆనంతారం గ్రామంలో తెలంగాణ హరితోత్సవం


న్యూస్ పవర్ , 19 జూన్ , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆనంతారం గ్రామంలో తెలంగాణ హరితోత్సవం
కార్యక్రమాన్ని నిర్వహించారు 
ముఖ్య అతిధిగా పాల్గొని  మొక్కలు నాటిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు , ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్ ఈ సందర్భంగా  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు   మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్  చేపట్టిన హరితహారం కార్యక్రమం  భూమి తల్లికి పచ్చని రంగేసినట్టు.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో తెలంగాణ ప్రాంతం అలరారుతున్నది. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం.. నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో చూడమూచ్చటగా ఉన్నది. ప్రజల్లో పచ్చదనం గురించి చైతన్యం తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఎంతో పచ్చదనం పెరగడం జరిగిందని అన్నారు.ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకొనేందుకు సీఎం కేసీఆర్‌ అనేక పథకాలకు అంకురార్పణ చేశారు. భవిష్యత్‌ తరాలకు ఆస్తులు పంచడం కన్నా.. స్వచ్ఛమైన గాలి, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే సీఎం కేసీఆర్‌ గొప్ప సంకల్పం నుంచి పుట్టినదే తెలంగాణకు హరితహారం పథకం తెలంగాణ హరితోత్సవం లో బాగంగా మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి  ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ  వైస్ ఎంపీపీ సుధాగోని శ్రీనాథ్ గౌడ్ , ఎంపీటీసీ తీగల పుష్పలత, ఎంపీడీఓ మీర్జా గారు,APO చంద్రయ్య, హరీష్,టెక్నికల్ అసిస్టెంట్ అధికారులు,గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి,వార్డ్ సభ్యులు,అంగన్వాడీ సభ్యులు, ఆశవర్కర్ లు, వి ఓ సభ్యులు మహిళ సంఘం సభ్యులు,మహిళలు ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments