JSON Variables

బెల్లంపల్లి నియోజకవర్గానికి వరాలు కురిపించిన మంత్రి హరీష్ రావు

బెల్లంపల్లి నియోజకవర్గానికి వరాలు కురిపించిన మంత్రి హరీష్ రావు
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి మండలంలోని వాటర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి మరియు వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించడానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లిలో ఇంతకముందు మెడికల్ కాలేజీ నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన కూడా అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల నిర్మాణం ఆగిపోయిందని , ఇప్పుడు బెల్లంపల్లి లో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం మరియు డయాలసిస్ సెంటర్, మెడికల్ ఎక్విప్మెంట్, డాక్టర్స్ ని  ఏర్పాటుచేసి  బెల్లంపల్లి ప్రజలకు నాణ్యమైన  వైద్యం అందించాలని మంత్రి హరీష్ రావు ను కోరారు, మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రి  లో అన్ని సౌకర్యాలు ఉంటాయని, డాక్టర్స్ ని, మెడికల్ ఎక్విప్మెంట్ ని, డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయిస్తానని చెప్పారు, గర్భిణీ స్త్రీలకు  ప్రత్యేకమైన చికిత్స మరియు న్యూట్రీషియన్ తో కూడిన ఆహారాన్ని వారికి అందజేస్తామని,న్యూ బోర్న్ బేబీ సెంటర్స్ నిర్మిస్తామని,ఈ 100 పడకల ఆసుపత్రి లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, 4 కోట్లతో 20 ఎఎన్ఎం సబ్ సెంటర్స్ నిర్మిస్తామని ప్రజల ముందు తెలియజేశారు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రి  12 కోట్ల 60 లక్షలు తో నిర్మించబడుతుందని ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా కల్పిస్తామని మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి బెల్లంపల్లి లోని సింగరేణి భూములను పట్టా చేపిస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత,ఎమ్మెల్సీ దండే విఠల్, రాష్ట్ర డిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ భారతి హాలికేరి, జడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి, గ్రంధాలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగాల సత్యనారాయణ మరియు ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతశ్రీధర్ ,వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్,మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కళ్యాణిభిమాగౌడ్,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్స్,తెరాస ప్రజాప్రతినిధులు,తెరాస నాయకులు,యువజన, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, ఆర్పిలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments