JSON Variables

నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లకి శంకుస్థాపన


బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్ , స్థానిక సర్పంచ్ శ్రీమతి చెట్టి లావణ్య రాజు గార్లతో కలిసి నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
అనంతరము ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తుందని, అందులో భాగంగానే గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్  ప్రత్యేక చొరవతోనే నిధులు మంజూరు అయి పనులు ప్రారంభం అవటానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎలుక లత దేవయ్య, ఉప సర్పంచ్  వార్డు సభ్యులు,తెరాస మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, తెరాస నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షులు కత్తి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments