JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ సభ్యులు తాండూర్ మండలం రేచిని వాస్తవ్యులు శ్రీమతి శ్రీ జక్కం నాగమణి తిరుపతి గార్లు సత్యనారాయణ వ్రతం  సందర్భంగా వారి సహకారంతో సోమవారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ  బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు మరియు సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments