JSON Variables

నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న శుద్ధ జల కేంద్రాలు

.

న్యూస్ పవర్ రిపోర్టర్ .పసుల తిరుపతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయా మండల  కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో మినరల్ వాటర్ పేరిట భలే చౌక బేరం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తున్నారు.
ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఐ ఎస్ ఓ సర్టిఫికెట్ ఉండాలని అని, మండల వ్యాప్తంగా ఇటువంటి సర్టిఫికెట్ లు రెండు అంకెలకు మించి లేవు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించే విషయంలో కంట్రోల్ తప్పారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్కొక్క చోట ఒక్కోరకంగా మినరల్ వాటర్ యజమానులు దోచుకుంటున్నారు. ప్రతి సమ్మర్ లోనూ సందట్లో సడేమియా అన్నట్టుగా పెంచుకుంటూ పోతున్నారు, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  దృష్టి సారించి నాణ్యతా ప్రమాణాలు పాటించని. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కోరుతున్నారు.

వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఐఎస్ఓ సర్టిఫికేట్ లేకుండా నాణ్యత ప్రమాణాలు, లేకుండా శుద్ధ జల కేంద్రాలను నడిపిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments