JSON Variables

సైబర్ భద్రత పై అవగాహన సదస్సు

సైబర్ భద్రత పై అవగాహన సదస్సు

 కోహెడ మండలం లోని తంగళ్ళపల్లి గ్రామం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ఈరోజు సైబర్ నేరాల పై అవగాహన కల్పించేందుకు సైబర్ కాంగ్రెస్ ను రాష్ట్ర పోలీసు శాఖ విద్యాశాఖ మరియు యంగిస్తాన్ ఎన్జీవో ఆర్గనైజేషన్ సహకారంతో పాఠశాల యాజమాన్యం నిర్వహించడం జరిగింది..

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ శ్రీమతి పాము నాగేశ్వరి గారు మండల విద్యాధికారి డాక్టర్ ఎం అర్జున్ గారు కోహెడ మండలం పోలీస్ స్టేషన్ సంబంధించిన షీ టీం  అధికారులు కోమలత, సిమ్రాన్ గార్లు స్కూల్ చైర్మన్ నాగలక్ష్మి గార్లు విచ్చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో ఆరో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు అందరూ పాల్గొని  సైబర్ నేరాలను అరికట్టడం పైన  అవగాహన పొందడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వై హిమబిందు మెంటర్  టీచర్ ఆర్ భాగ్యలక్ష్మి అలాగే సైబర్ అంబాసిడర్స్ గా ఏ ప్రణతి సత్య, నందిని . లు లు పాల్గొని ఎన్ని రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయో వివరంగా విద్యార్థులకు వివరించారు.

Post a Comment

0 Comments