JSON Variables

ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి నాయకులు పర్యటిస్తూ ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణ చర్చ

ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి నాయకులు పర్యటిస్తూ ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణ చర్చ.
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్

ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గంభీరావుపేట మండలం సముద్ర లింగాపురం నాగంపేట దమ్మన్నపేట గ్రామాలలో ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి నాయకులు పర్యటిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి మాదిగ కుల బంధువులను ఎమ్మార్పీఎస్ నాయకులను కలుస్తూ డిసెంబర్ 14 నాడు ఢిల్లీలో జరిగే జాతీయ మహాసభ విజయవంతం చేయడం కోసం మాదిగ విద్యార్థులతోపాటు ఉ యువకులు ఉద్యోగులు మాదిగ కుల బంధువులు అందరూ ఢిల్లీకి తరలిరావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ పిలుపునిస్తూ గ్రామాలలో ఉన్న మాదిగ కులస్తులకు అవగాహన కల్పించడం జరిగింది ప్రతి గ్రామం నుండి కుల బాంధవులు ఢిల్లీకి తరలిరావాలని కుల పెద్దలు మాట్లాడుకొని ఢిల్లీ కి వచ్చే దానికి మరి టికెట్ కూడా ఇప్పుడే రిజర్వేషన్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం ప్రతి మాదిగ ఉద్యోగి తో పాటు ఇద్దరు విద్యార్థులను లేక ఇద్దరు యువకులను తీసుకొని రావాలని వచ్చే ఇద్దరికీ కూడా టికెట్ ఖర్చులు ఆ ఉద్యోగస్తులు భరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ మహాజన నేత నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు జరుగుతున్న సాంఘిక న్యాయ సంగ్రామంలో జాతిని విజేతగా నిలబెట్టడానికి నడుం బిగించాల్సిన తరుణం వచ్చింది 27 ఏళ్లు ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ ఉద్యమం మాదిగల జీవితాలలో ఆత్మ గౌరవాన్ని పెంచింది సామాజిక చైతన్యాన్ని ఇచ్చింది పోరాడే శక్తులుగా దండోరా ఉద్యమం తయారుచేసింది డప్పుల దరువు లతో గ్రామాలను మేల్కొల్పిన మన తల్లిదండ్రులు రాజధాని నడిబొడ్డున దండోరా వేసి సామాజిక న్యాయాన్ని వినిపించారు గల్లి నుండి ఢిల్లీ వరకు మన ఉద్యమ ఆకాంక్షలను నడిపించారు కారం రొట్టెలు తిని చలిలో వణికి వానలో తడిసి ఎండలో ఎండి మనకోసం ఉద్యమాన్ని నిర్మించి ఈనాటివరకు నిలబెట్టారు 15 శాతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలను అప్పటికే దాదాపు 50 సంవత్సరాల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన వారే 10 నుండి 12 శాతానికి పైగా విద్య ఉద్యోగ రంగాలలో అనుభవించారు సంక్షేమ మరియు రాజకీయ రంగాలలో అంతకంటే ఎక్కువగా ఫలితాన్ని మాలలు అనుభవించారు దీనితో అన్ని రంగాలలో మాదిగలు వెనుకబడి పోయారు గ్రామాలను రక్షించిన మనం వ్యవసాయాన్ని నడిపించిన మనం అం పరిసరాలను శుభ్రం చేసిన మనం సమాజ ప్రగతికి సమస్త శక్తిని ధారపోసిన మనం మన హక్కులను అవకాశాలను కోల్పోయి ఉన్న సందర్భాల్లో మన దీనగాథ ను చూసిన మందకృష్ణ మాదిగ గారు మన కులానికి దిక్సూచిలా నిలిచాడు మన బ్రతుకులలో నిండిన చీకటిని పారద్రోలడానికి సూర్యునిలా పొడిచాడు దండోరా నినాదాన్ని దిగంతాలకు వినిపించాడు సామాజిక న్యాయ సూత్రానికి జీవంపోసి ఉరువాడ ఏకం చేశాడు ఊరవతల ఉన్న మాదిగలను ఉరితో కలిపి నడిపించాడు జనాభాలో మా వాటా ఎంతో అవకాశం లో కూడా మాకు అంటే వాటా దక్కాలని నినదించాడు ఎస్సీ కులాల లోని 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు దక్కాలని రాజ్యాంగంలోని న్యాయ సూత్రాలు అమలు కావాలని పోరాటాన్ని నిర్మించాడు లక్షలాదిమంది మాదిగల తో హైదరాబాద్ నగరాన్ని దిగ్భంధం చేసి నాటి ప్రభుత్వం మెడలు వంచి 2000 సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్లు ఏ ఏ బి సి డి లు గా వర్గీకరిస్తుంది చట్టాన్ని సాధించారు దాని ఫలితంగా అది అమలు జరిగిన నాలుగు సంవత్సరాల కాలంలోనే వేలాది ఉద్యోగాలు లభించాయి విద్యారంగంలో వేలాది సీట్లు పొందారు గ్రూప్ వన్ గ్రూప్ టు లెక్చరర్ టీచర్ ప్రొఫెసర్ మొదలైన అనేక రంగాల్లో మాదిగలు గణనీయమైన సంఖ్యలో నాడు ఉద్యోగంలో చేరారు అలాగే ఇంజనీరింగ్ మెడికల్ లా ఫార్మసీ సీట్ల లో మాదిగ విద్యార్థులు పెద్ద మొత్తంలో అవకాశాలు పొంది తమ కోర్సులను పూర్తి చేశారు అదేవిధంగా సంక్షేమ రంగాలలో రావలసిన వాటా కోసం పోరాటం చేసి జీవో 183 సాధించిన ఫలితంగా మాదిగల ఆర్థిక సామాజిక జీవన స్థితిగతు లో మునుపు ఎన్నడు లేని విధంగా అభివృద్ధి జరిగింది ఆ సమయంలోనే రాజకీయ రంగంలో పంచాయతి నుండి పార్లమెంటు వరకు మన ప్రాతినిధ్యం కూడా అనూహ్యంగా పెరిగింది అందుకని ని రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లోనే ఏసీ ఎబిసిడి వర్గీకరణ బిల్లును నెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రతి గ్రామం నుండి మాదిగ కులస్తులు మేము సైతం అంటూ కదలిరావాలని ఢిల్లీకి పిలుపునిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి నాయకులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ గద్దల గణేష్ పొందుర్తి నవీన్ చెప్పాలా దుర్గయ్య బాల్ నర్స్ సత్యం బాలయ్య దేవరాజు బాలు సత్తయ్య బాబు ఉ ప్రభాకర్ బాలరాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు,

Post a Comment

0 Comments