JSON Variables

దొంగల పట్ల జాగ్రత్త వహించండి

దొంగల పట్ల జాగ్రత్త వహించండి
NEWSPOWER REPORTER:Saireddy
హైదరాబాద్ పట్టణం కి సంపూర్ణ అనే మహిళ తన అమ్మ వాళ్ళ ఊరు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్ళుటకు వేములవాడ మండలం లోనీ.తిప్పాపూర్ బస్టాండ్ వద్ద బస్ వచ్చిన తొందరలో తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి బస్ ఎక్కి కొద్ది దూరం వెళ్ళాక బ్యాగ్ గుర్తు వచ్చి తిరిగి బస్ స్టాండ్ కి వచ్చి చూసేసరికి తన బ్యాగ్ కనిపించలేదు ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు అని పోలీస్ స్టేషన్ కి రాగా బ్యాగ్ లో నగదు మరియు తన సెల్ ఫోన్ వుంది అని ఫోన్ ఆన్లైన్ లో వుంది అని చెప్పగా టెక్ టీమ్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఫోన్ లొకేషన్ కోసం ట్రాక్ చేయగా అగ్రహారం వద్ద లొకేషన్ చూపించగా బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ తిరుపతి నాయక్ హుటా హుటిన అట్టి ప్రదేశానికి వెళ్లి వెతకాగా చెట్ల పొదలలో బ్యాగ్ కనిపించగా అట్టి బ్యాగ్ లో నగదు, ఫోన్ ఉండగా బాధిత మహిళ కు అట్టి బ్యాగ్ ని అప్పగించగా వేములవాడ పోలీస్ వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ దొంగల పట్ల ప్రజలు జాగ్రత్త గా ఉండాలి అని,సెల్ ఫోన్ లు, నగదు విషయం లో అప్రమత్తం గా ఉండాలి అని,పట్టణం లో దొంగలను పట్టుకొనుటకు ప్రత్యేక మఫ్టీ బృందం ని ఏర్పాటు చేసి తిప్పాపూర్ బస్టాండ్, దేవస్థానం మరియు రద్దీ ఎక్కువ వుండే ప్రదేశాలలో తిరుగుతున్నారు అని సీ సీ కెమెరా ల ద్వారా ఎప్పటి కప్పుడు పట్టణంలోని ట్రాఫిక్ మరియు ఇతర కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.సాంకేతిక ను ఉపయోగించి బాధిత మహిళ కు బ్యాగ్ ని అప్పగించటం లో చురుకైనా పాత్ర వహించిన కానిస్టేబుల్ రాజశేఖర్, తిరుపతి,హోమ్ గార్డ్ నాగరాజు లను ఇన్స్పెక్టర్ అభినందించారు.

Post a Comment

0 Comments