స్వశక్తి రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
• కరీంనగర్ మిల్క్ సొసైటీ తో సమన్వయం చేసుకొని 1800 పాడి పశువుల యూనిట్ల ఏర్పాటు • మైక్రో ఎంటర్ప్రైజెస్ విస్తరణకు కట్టుదిట్టమైన చర్యలు •స్కూల్ యూనిఫామ్ కుట్టు పనిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన సిరిసిల్ల • ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
న్యూస్ పవర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా : ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలతో మహిళలు ఆదాయ వనరులను సృష్టించి, ఆర్థికంగా అభివృద్ధి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.
ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు ఆదాయ వనరులు కల్పన దిశగా ప్రభుత్వం రూపొందించిన పలు ప్రణాళికలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ముందుగా వివరించారు. ప్రతి యూనిట్ ఏర్పాటు తీసుకోవాల్సిన చర్యలు, దీని వల్ల కలిగే లాభాలను తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలు అందజేసి ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో ఉన్న మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల రుణాలు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలను చిన్నచిన్న వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు వినియోగించాలని కలెక్టర్ తెలిపారు. మహిళలు తమకు అందే రుణాలను వినియోగించి ఆదాయ వనరులను సృష్టించుకోవాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాల ఏర్పాటు పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. పాడి పశువులు, కుట్టు మిషన్ కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు, కుటీర పరిశ్రమలు, పౌల్ట్రీ, ఆహార శుద్ధి కేంద్రాలు కష్టం హైరింగ్ సెంటర్స్, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్, మిల్క్ పార్లర్స్, క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ ,ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మొదలగు రంగాలలో మహిళలు వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సలహాలు ఇతర సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం అందిస్తుందని అన్నారు. ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 1800 , ఈడి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరో 600 పాడి పశువుల యూనిట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, కరీంనగర్ మిల్క్ డైరీ యూనిట్ తో వీరిని సమన్వయం చేస్తామని, ఆసక్తి అర్హత కలిగిన మహిళా సంఘాల ద్వారా వీటిని ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలో 5123 మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం ఉన్న 3392 వ్యాపార యూనిట్ల విస్తరణ, 1607 నూతన వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో ఉన్న వ్యాపార యూనిట్లు నడిపే మహిళా సంఘాలతో చర్చించి వారి అనుభవాలను కలెక్టర్ తెలుసుకున్నారు . వ్యాపార అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. మహిళా సంఘాల ద్వారా మన జిల్లాలో 31 యూనిట్ లు ఏర్పాటు చేసి స్కూల్ ఏకరూప దుస్తులు కుట్టించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కొట్టే అవకాశం కల్పించి, కుట్టుకూలీ ధర పెంచడం పట్ల మహిళా సంఘాల సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఏకరూప దుస్తులు కుట్టడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ అభినందించి సత్కరించారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 120 ఆహార శుద్ధి కేంద్రాల, 5 కష్టం హైరింగ్ సెంటర్లు, 1 మిల్క్ పార్లర్, 4 అమ్మ క్యాంటీన్లు, 1 ఈ వెట్ మేనేజ్మెంట్ , 1 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్నామని, ఆసక్తి అర్హత కలిగిన మహిళ సంఘాలచే వీటిని ఏర్పాటు చేయించి ఆర్థికంగా నిల దొక్కుకునేందుకు సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మన సిరిసిల్ల జిల్లాలో 10 నూతన మీ సేవా కేంద్రాలను మహిళలచే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, అదనపు డి ఆర్ డి ఓ శ్రీనివాస్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత డి ఓ కరీంనగర్ డైరీ డాక్టర్ జయకర్ పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి ఈ డి ఎస్ సి కార్పొరేషన్ స్వప్న డిడిఎం నాబార్డ్ దిలీప్ లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ జిఎం ఇండస్ట్రీస్ భారతి పిడిఎఫ్ శ్రీనివాస్ జోనల్ మేనేజర్ శ్రీనిధి రవికుమార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments