JSON Variables

డబుల్ బెడ్ రూoమ్ ఇళ్లకు తక్షణమే వసతులు కల్పించాలి



డబుల్ బెడ్ రూoమ్ ఇళ్లకు తక్షణమే వసతులు కల్పించాలి
  న్యూస్ పవర్ , 8 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్ రూoమ్ ఇళ్లను 
గురువారం రోజున సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్
సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ముషం రమేష్  మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పూర్తికాని డబుల్ బెడ్ రూoమ్ ఇళ్లను ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వాలని గత మూడు నాలుగు రోజులుగా నివాసం ఉంటున్న పేద ప్రజలను ఇబ్బందుల గురి చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 2016 ఏప్రిల్ 24వ తేదీన శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్ రూoమ్ ఇల్లు ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో నిరుపేదలు విసిగి వేసారి పోయి తమకు తాముగా గతంలో గ్రామ సభలో ఆమోదించిన ప్రకారంగా తమ ఇండ్లలోకి వెళ్లి నివాసం ఉంటున్నారని తెలుసుకున్న స్థానిక తాసిల్దార్ డబుల్ బెడ్ రూoమ్ ఇళ్ల వద్దకు వచ్చి 15 రోజులు గడివిస్తే పట్టాలు పంపిణీ చేస్తాం కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేయండి అనడం ఎంతవరకు న్యాయమని గత ఆరు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న పేదలకు ఇళ్లలో ఉండగానే పట్టాలను పంపిణీ చేయడంలో అధికారులకు ఇబ్బందులు ఏమున్నాయో అర్థం కావడం లేదని అన్నారు అలాగే గత మూడు రోజుల క్రితం స్థానిక సెస్ అధికారులు వచ్చి ఇళ్లలోకి విద్యుత్ సప్లై కాకుండా నిలిపేయడం బాధాకరమని అన్నారు. ఒక్క పెద్ద లింగాపూర్ గ్రామంలోని 40 డబుల్ బెడ్ రూoమ్ ఇళ్లకు ఎంత విద్యుత్ అవసరం ఉంటుందని వేలకోట్ల రూపాయలు బకాయిలు ఉన్న బడా కంపెనీలను వదిలేసి నిరుపేదల ఇళ్లపై ఇలా కక్ష సాధించడం న్యాయం కాదని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని అన్నారని గుర్తు చేస్తూ మరి పేదలు ఉంటున్న ఇండ్లకు ఎందుకు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని వారు వేసుకుంటున్న విద్యుత్ వైర్లను ఎందుకు తొలగిస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వసతులు కల్పించకపోతే త్వరలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రవెల్లి నాగరాజు, గన్నేరo నర్సయ్య సిఐటియు నాయకుడు సావనపల్లి రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్, రైతు సంఘం నాయకులు సామ నర్సింహారెడ్డి,ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షకార్యదర్శులు సొల్లు సాయి కుమార్, పెండల ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments