JSON Variables

ప్రజలను మభ్యపెడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం

 ప్రజలను మభ్యపెడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం                                                                                  

 న్యూస్ పవర్ , 22 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పసుల వెంకటి మాట్లాడుతూ 
పత్రిక ప్రకటలు, రంగు రంగుల పోస్టర్లు, సినిమా గ్రాఫిక్స్ తో వీడియోలు, ఫోటోలతో పాటు మాయదారి మాటలు , వగలమారి వేషాలు, కైపెక్కించే పాటలు చూపుతూ ఒకపక్క ప్రజలను మభ్యపరుస్తూ, ఎదిరించే వారిని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టిస్తు ల్యాండ్, సాండ్ తో పాటు మట్టి, గుట్టలు,చెట్లు, చెరువులు, కుంటలను వదలకుండ కబ్జాలు చేస్తు, ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేస్తూ పెద్ద దొరల ఘడీల సామంత దళిత దొరలతో రాజ్యపాలన సాగిస్తున్న వారికి వనికేది లేదు, బెనికేది లేదు.   
కాళేశ్వరంలో కమిషన్లు, మిషన్ కాకతీయలో కమిషన్లు, భగీరథలో భాగసాములు, లిక్కర్ లో కింగ్ అండ్ క్వీన్ గా పేరొందిన మహా దొరల సామ్రాజ్యం మీది. అన్ని అభివృద్ధి పనులు అయిపోయాయి ఇక చేయడానికి ఏమి లేవు.. ఏమైనా ప్రజలే చెప్పాలి అని మీకు మైకు కనబడిన, మంది కనబడిన  తెల్లారకముందే చెక్కులు పట్టుకుని ఊరూరా తిరుగుతున్నది ఎవరు? అన్నపూర్ణ ప్రాజెక్టు మొదటి ఫలితం ఎవరి ఫార్మ్ కు వచ్చింది.. పిల్ల కాలువ ఒక్కటి మాత్రమే ఎవరి కోసం నిర్మించుకున్నారు.. 

దుమ్ము రేగుతున్న రోడ్లు, కంకర తేలి, గుంతలై పోతున్న ఇంత మన్నుపొయ్య శాతకాలే, మంత్రి అండ, ఎం.ఎల్.ఏ చలవతో ఆరు ట్రాక్టర్లు, మూడు లారీల ఇసుక దందాలు, గుట్టల దగ్గరి పారంపోగులు పట్టాలై నాలుగేళ్లలో సైకిలు లేనోళ్ళు ఫార్చూనర్ కార్లు, డంతస్తుల మీద అంతస్తులు ముందు బొర్రలు, వెనుకాల అవి పెరిగింది ఎవరికో అర్థమవుతుంది. 
వినాశకాలం ముందుంటే కళ్ళు నెత్తికెక్కి నాట్యం చేస్తాయట అంటుంది బి.ఆర్.ఎస్ నాయకుల అహంభావపు మాటలు.. చేష్టలు 
ఎగిసిపడకుర్రి తీరందాటేదాకానే పట్టాతోపం దాటాక కాళ్ళ కిందకే పరిమితం .. ఎక్కడినుండి మొదలు పెట్టారో మల్లి అదే స్థాయికి పోక తప్పదనీ అన్నారు.
                          

Post a Comment

0 Comments