JSON Variables

కాంగ్రెస్ పార్టీ నాయకులముందస్తు అరెస్టు

కాంగ్రెస్ పార్టీ నాయకులముందస్తు అరెస్టు
 న్యూస్ పవర్ , 23 మార్చి , ఇల్లంతకుంట :
ఈరోజు ముందస్తు అరెస్టు గా ఇల్లంతకుంట మండలం  కాంగ్రెస్ పార్టీ నాయకులనుపోలీసులు కేసీఆర్ పర్యటన నిమిత్తం ఎక్కడ అడ్డుకుంటామన్నా భయంతో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులను ప్రివెంటరీ అరెస్టుకు  జరిగింది అయ్యా కేసీఆర్  మీరు నష్టపోయిన పంటలను  పరిశీలించడానికి వచ్చినందుకు చాలా సంతోషం కానీ ఏదో వచ్చిన మా పోయినమా అన్నట్టు కంటి తుడుపు చర్యలుగా చేసిపోతే రైతులు తీవ్రంగా నష్టం పోయి ఉన్నారు వారిని ఆదుకునే ప్రయత్నం కచ్చితంగా చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా  గత కాంగ్రెస్ ప్రభుత్వ ఉన్నప్పుడు పకృతి విపత్తు జాతీయ విపత్తుగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు   పంట నష్టపరిహారం అందించినాము అప్పుడు ఇసుక కొట్టి నేరవా పెట్టి నా గుంట రెండు గుంటలు పోయిన రైతులకు కూడా మేము నష్టపరిహారం అందించినా దాఖలాలు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్నాయి ఒక పత్తి వరి పొద్దుతిరుగుడు కాకుండా అంతర్పంటలు కూరగాయలు ఒక మండలమని కాకుండా ప్రతి  గ్రామంలో తెలంగాణ మొత్తం నష్టపోయిన రైతులే ఉన్నారు. పేపర్ లీకేజీలో  30 లక్షల మంది విద్యార్థులు పేపర్ లీకేజీ అయి  విద్యార్థులు నష్టపోయినారు అలాగే ప్రకృతి విపత్తు వడగండ్ల వానకు దాదాపు 70 శాతం మంది రైతులు మొత్తం నష్టపోయినారు రైతులను వెంటనే నష్టపరిహారం అంచనా వేసి తొందరగా నష్ట పరిహారం అందించే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదో వచ్చిన మా పోయినమా అని కాకుండా కంటి తుడుపు చర్యలు  కాకుండా కచ్చితంగా తొందరలో మీ అధికారులతో పర్యవేక్షించి తొందరగా  ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించగలరు  రైతుల కొరకే కొట్లాడుతున్నాం. మమ్ములు అరెస్టు చేసినంత మాత్రాన ఊరుకునే ప్రసక్తే లేదు  రైతుల కొరకు ఎంతవరకైనా తెగించి కొట్లాడి మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదాకా మా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతాం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పసుల వెంకటి దాట్ల వీరేశం ఎండి జమాల్ ప్రసాద్ నరేందర్ రెడ్డి మామిడి నరేష్ బద్దం రమణారెడ్డి సంతోష్ బాబు కాశి పాక బాబుసుగుణాకర్ రెడ్డి మల్లేశం మల్లయ్య రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments