విజయ గర్జన సభ విజయవంతం చేద్దాం
విజయ గర్జన సభను విజయవంతం చేద్దామని మండల అధ్యక్షుడు సురేందర్ రావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలనీ, సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలన్నారు. ఇక్కడ ఎంపీపీ శరత్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, మండల యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment