JSON Variables

తాళ్ళ గురీజాల మండలం , బట్వాన్ పల్లి లో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీ, గుడుంబా తయారీకి వినియోగించే ముడిసరుకులు మరియు నిషేధిత పొగాకు

NEWSPOWER REPORTER:Sairam
తాళ్ళ గురీజాల మండలం , బట్వాన్ పల్లి లో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీ, గుడుంబా తయారీకి వినియోగించే ముడిసరుకులు మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు(75) కిలోల పటిక, (17) కిలోల బెల్లం, 5 వేల రూపాయల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత.
పూర్తి వివరాల్లోకి వెళితే రామగుండం కమీషనర్ అఫ్ పోలీస్ శ్రీ. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి. IPS. (డిఐజి) గారి ఆదేశాల మేరకు,టాస్క్ ఫోర్స్ సీఐ..మహేందర్ గారి ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు బెల్లంపల్లి మండలం బాట్వాన్ పల్లి గ్రామానికి వెళ్లి నాంపల్లి రవీందర్ అను వ్యక్తి  కిరాణ దుకాణాన్ని తనిఖీ చేయగా, గుడుంబా (నాటుసారా) తయారీకి ఉపయోగించేటువంటి సుమారు (75) కిలోల పటిక మరియు  (17) కిలోల బెల్లం, 5 వేల రూపాయల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యం అయ్యాయి. నిందితుడిని  విచారించగా, బెల్లంపల్లికి చెందిన  అమ్రాన్ అనే వ్యక్తి తనకు అమ్మినట్టుగా తెలియజేశాడు. ప్రస్తుతానికి అమ్రాన్ పరారీలో ఉన్నాడు.
పట్టుబడిన వ్యక్తిని మరియు బెల్లం, పటికను తదుపరి విచారణ నిమిత్తం తాళ్ళ గురిజాల పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.

Post a Comment

0 Comments