వాల్మీకి జయంతి సందర్భంగా
రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో.కలెక్టర్ అనురాగ్ జయంతి.గారితో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్రపటానికి పుల మాల వేసి వాల్మీకి బోయ సోదర సోదరీమణులకు వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపి అనంతరం వాల్మీకి బోయకులస్థుల పలు సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకవెళ్లిన వాల్మీకి బోయ రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు
మీసరగండ్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ రామకథను గానం చేసి వాల్మీకి మహర్షి లోకాన్ని ఉద్ధరించాడు. ఇరవై నాలుగువేల శ్లోకాలతో ఆయన రామాయణాన్ని రూపొందించాడని అన్నారు..మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శ భావాలను బోధించే మధుర కావ్యం రామాయణం అని అన్నారు. అటువంటి గొప్ప కావ్యాన్ని రచించి యుగాలు మారినా కూడా ఆదర్శంగా నిలిచే విధంగా వాల్మీకి మహర్షి గారు సమాజానికి అందించడం గొప్ప విషయమన్నారు.
Comments
Post a Comment