ఇల్లంతకుంటలో రేపు నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
ఇల్లంతకుంట, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్ పథకం కింద నూతనంగా మంజూరైన పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 13వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇల్లంతకుంటలోని ఆర్యవైశ్య భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల పరిధిలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు హాజరుకానున్నారు.
నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి హాజరై తమ మంజూరు పత్రాలను స్వీకరించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో కోరారు.

0 Comments