వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం

వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం

న్యూస్ పవర్ , 9 అక్టోబర్ , ఇల్లంతకుంట:
 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకురాలు కొలనూరు ముత్తవ్వ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమాల అనిల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య, రాజు శ్రీశైలం, చీమలగొట్టు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొలనూరు ముత్తవ్వ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిన్ రంజిత్, గుంటి వేణు,n అజయ్ మహిళా మోర్చా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments