ఘనంగా శ్రీ వాణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

ఘనంగా శ్రీ వాణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

న్యూస్ పవర్, అక్టోబర్ 9 ఇల్లంతకుంట:
 ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ వాణి పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు పిల్లల తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.ఇట్టి కార్యక్రమం లో గణగోని శ్రీకాంత్, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పండుగల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాఠశాల ఆవరణ బతుకమ్మలతో, పూల అందాలతో పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి పట్ల అవగాహనను, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా సాగింది.
ఈ కార్యక్రమంలో  శిల్ప, సుస్మా, మౌనిక, స్వర్ణ, స్వప్న, రవళి, కరుణ, రేణుక, ఇన్షిరా, కరుణ, శ్రీలత,అనిత,ప్రతిభా, ఆకాంక్ష,బాబు, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments