కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
న్యూస్ పవర్ , 9 అక్టోబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. కళాశాల ప్రాంగణంలో వాటిని ఉంచి చుట్టూ చేరి ఆడిపాడారు. సంప్రదాయ పాటలకు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ సందడి చేశారు. వివిధ ఆకృతుల్లో పేర్చిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు బృందాలుగా పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటారు. అధ్యాపకులు వేడుకల్లో భాగస్వాములై వారిని ప్రోత్సహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమం సాగింది. అనంతరం సిబ్బంది, విద్యార్థులు పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకలతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
0 Comments