ముస్కానిపేటలో రెండు ఆలయాల్లో చోరీ
న్యూస్ పవర్ , 7 అక్టోబర్, ఇల్లంతకుంట:
ముస్కానిపేట గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి, ఎల్లమ్మ ఆలయాల్లో చోరీ జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం ముస్కానిపేట వాస్తవ్యులైన శ్రీ పెరంబదూరు సత్యనారాయణ కు అదే గ్రామానికి చెందిన ఓరుగంటి కరుణాకర్ ఫోన్ చేసి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ తాళం పగలగొట్టి ఉన్నట్లు సమాచారం అందించారు. దీంతో సత్యనారాయణ అక్కడికి చేరుకుని పరిశీలించగా, హుండీ తాళం పగలగొట్టి అందులోని సుమారు రూ. 3,000 నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు గుర్తించారు.
అలాగే సమీపంలోని ఎల్లమ్మ గుడి తాళాలు కూడా పగలగొట్టి, అమ్మవారి మెడలోని రోల్డ్ గోల్డ్ పుస్తె, రెండు వెండి కళ్ళు, వెండి మట్టెతో పాటు హుండీలోని నగదు మొత్తం సుమారు రూ. 5,000 విలువైన సొత్తును దుండగులు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వెల్లడించారు.
0 Comments