అనంతారం లో బతుకమ్మ నిమజ్జనం కు ఏర్పాట్లు

అనంతారం లో బతుకమ్మ నిమజ్జనం కు ఏర్పాట్లు
 
 న్యూస్ పవర్ , 6 అక్టోబర్, ఇల్లంతకుంట:
అనంతారం గ్రామంలో పెద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం గ్రామ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు.ఈ సందర్బంగా గ్రామంలోని బ్రిడ్జి సమీపంలో ఉన్న చెత్త చెదారం ముళ్ల పొదలను ఎక్సవేటర్ సహాయం తో తొలగించి మహిళలు, గ్రామస్తులు నిమజ్జన స్థలానికి వెళ్ళందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదును చేశారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రెటరీ మారుతి ఉప సర్పంచ్ కదం జయంత్, వార్డ్ సభ్యులు మల్యాల రాజశేఖర్, పీటర్,రమేష్,నాయకులు నర్సయ్య, గోనెపల్లి వెంకటేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments