తల్లి జ్ఞాపకార్థం కుర్చీల వితరణ
న్యూస్ పవర్, 10 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
సమాజానికి తోడ్పాటు అందించడమే తల్లిదండ్రులకు ఇచ్చే నిజమైన నివాళి అని నిరూపించారు ఇల్లంతకుంట మండలం జవహరిపేట గ్రామానికి చెందిన ఎల రాజు తన తల్లి ఎల మల్లవ్వ జ్ఞాపకార్థం గ్రామ ప్రజల సౌకర్యార్థం స్థానిక పల్లె దవాఖాన, గ్రామ పంచాయతీ కార్యాలయానికి కలిపి మొత్తం 20 కుర్చీలను ఆయన వితరణగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎల రాజు మాట్లాడుతూ.. గ్రామంలోని పల్లె దవాఖానకు వచ్చే రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం గ్రామ పంచాయతీకి వచ్చే ప్రజలు కూర్చునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కుర్చీలను అందించినట్లు తెలిపారు. తన తల్లి జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలనే ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంపెల్లి నాగరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment