బీఆర్ఎస్ నాయకుల అరెస్టు
న్యూస్ పవర్, 10 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరనీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎండ్ర చందన్, గుంటి మధు అన్నారు
సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పిలుపు మేరకు
వారిని ముందస్తు అరెస్టు చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు , ఈ సందర్భంగా వారు మాట్లడుతూ
ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందనీ
ఉద్యమ కారుల విద్యార్థుల నిరసన హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా, నిరసనలకు ముందే అరెస్టులు చేయడం సరికాదనీ అరెస్టులు, నిర్బంధాలతో విద్యార్థుల ఉద్యమ కారుల గొంతుకను అణచలేరునీ విద్యార్థుల హక్కుల కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందనీ తెలిపారు.
Comments
Post a Comment