న్యూస్ పవర్ , 18 ఆగస్టు , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు.
ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ఏర్పాటు అంశంతో పాటు వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచులు ప్రస్తావించిన సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన కొన్ని అభివృద్ధి పనులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం సర్పంచుల ఫోరం అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగగా, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు పేరును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. సమావేశంలో పాల్గొన్న సర్పంచులంతా చప్పట్లతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో మామిడి రాజును మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా మామిడి రాజును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఊట్కూరి వెంకట రమణారెడ్డిని కూడా ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా మామిడి రాజు మాట్లాడుతూ సర్పంచుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. కట్టబెట్టిన పదవిని బాధ్యతతో నిర్వహిస్తానని, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటానని, ఫోరం చైర్మన్ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేకు, సర్పంచులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాత మల్లేశం, నేరెళ్ల విజయ్‌గౌడ్, బొల్లవేణి మంజుల-రమేశ్, అరుకాల నవీన్, ఒల్లాల రజిత-వెంకటేశం, చింతమడక కళ్యాణ, పండుగ సునిత-తిరుపతి, కాంపెల్లి నాగరాజు, పోతరాజు చంటి, జుట్టు శేఖర్, మేడిపెల్లి భాస్కర్‌రెడ్డి, గొడుగు విఠల్, మీసాల కనకరాజు, సింగిరెడ్డి రచన-వెంకటరెడ్డి, వంచ చంద్రారెడ్డి, ఎం.లావణ్య-రవి, నాయిని నవీన్‌కుమార్, చల్లా నవీన్‌రెడ్డి, శ్రీవాణి-సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మామిడి రాజు
• సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి హామీ
Comments
Post a Comment