గీతాకార్మికులకు ఐడి కార్డులు పంపిణీ
న్యూస్ పవర్ , 24 ఆగస్టు , ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన 11మంది గీతా కార్మికులకు సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సి ఐ ఎం శ్రీనివాస్ సోమవారం గీతా కార్మికులకు పెన్షన్ దరఖాస్తుల కోసం గాను గీతా కార్మిక ఐడి కార్డులను పంపిణీ చేశారు అర్హులైన గీతా కార్మికులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆయన గీతకార్మిక సంఘ సభ్యులను కోరారు 50 సంవత్సరములు నిండిన గీతా కార్మికులు ఐడి కార్డ్ కలిగినటువంటి వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన గీతకార్మిక సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎ స్సై బత్తిని ప్రణీత్ గౌడ్ ఇల్లంతకుంట గౌడ సంఘ అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య గౌడ్ ఉపాధ్యక్షుడు అంతటి రమేశ్ గౌడ్ కోశాధికారి ముంజ భాస్కర్ సారా రమేశ్ గౌడ్ కొయ్యడ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment