ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఏర్పాటు చేయాలి
• గ్రామాలు, మున్సిపల్ వార్డులో ప్రత్యేక కేంద్రాలు సిద్ధం చేయాలి
• 18 నుంచి 59 ఏళ్ల వారు అర్హులు
• జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
• ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) పై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశించారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) అమలులో భాగంగా జిల్లాలోని ఆర్డీవోలు, డీఆర్డీఓ, సీపీఓ, డీపీఓ, డీసీఎస్ఓ, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో మొత్తం 1,92,000 కుటుంబాలు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 19వ తేదీ నుంచి మొదలు పెట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఆయా గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు అందజేస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి చెంది రేషన్ కార్డు ఉన్నవారు.. లేనివారు సైతం అర్హులని స్పష్టం చేశారు. 18 నుంచి 59 ఏళ్ల వారు బీమాకు అర్హులని వెల్లడించారు. బీమా పొందే వారు నామినీలుగా ఎందరినైనా ఎంచుకోవచ్చని, బీమా పరిహారం వివరాలు దరఖాస్తులో స్పష్టంగా తెలియజేసి సంతకం చేయాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.ఐదు లక్షల విలువైన బీమా వర్తిస్తుందని వెల్లడించారు.
అధికారులు ఆయా గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక శిబిరాల వద్ద హెల్ప్ డెస్క్ లు, టెంట్లు, కుర్చీలు, తాగునీటి సదుపాయం కావాల్సిన సిబ్బంది, యంత్రాలు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
టెలీ కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీర భద్రయ్య, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments