చేయూత పెన్షన్ దరఖాస్తుల ఇంటింటి పరిశీలన.

చేయూత పెన్షన్ దరఖాస్తుల ఇంటింటి పరిశీలన

 న్యూస్ పవర్ , 25 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఏపీఎం కుమారస్వామి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను పరిశీలించి, అర్హతకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా నమోదు చేస్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింగిరెడ్డి రచన వెంకటరామిరెడ్డి ,ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు ఎలుక రామస్వామి,జీపీ కార్యదర్శి తిరుపతి రెడ్డి, సిసి విట్టల్ రెడ్డి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments