గంగాధర క్షేత్రంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

 గంగాధర క్షేత్రంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

న్యూస్ పవర్ , 24 నవంబర్ , ఇల్లంతకుంట:
 కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గంగాధర క్షేత్రంలో మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ పురోహితుడు మూగు నాగరాజు శర్మ నేతృత్వంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ వ్రతంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం విశేష ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ నిర్వహించిన ఈ పూజలతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడితో, ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులు భక్తిపారవశ్యంతో పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments